ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో ఇంధన పొదుపులో నెంబర్ వన్‌గా ప్రథమ స్థానం సొంతం చేసుకుంది. కేంద్ర ఇంధన సంరక్షణ శాఖ పిసిఆర్ ఎ (పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్) టీఎస్ఆర్టీసిలో 30 డిపోల చొప్పు న ఎంపికచేసి అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 ఇంధన పొదుపు సెలక్షన్ నిర్వహించింది. ఈ సెలక్షన్లో హైదరాబాద్-1 డిపో నెంబర్ వన్ డిపోగా ఉత్తమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గౌలిగూడ లోనీ హైదరాబాద్-1 డిపోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి రీజనల్ డీిఎంఎంఆర్సి రెడ్డి పాల్గొని డిపో మేనేజర్ రవీందర్‌తో కలిసి మాట్లాడుతూ.. ఇంధన పొదుపులో డిపో ప్రథమ స్థానాన్ని పొందటం డిపో అధికారుల, ఉద్యోగ సిబ్బంది కషియేనన్నారు. డిపో ఉత్తమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. డిపో ఎప్పుడు నెంబర్‌వన్‌గానే నిలవాలని, ఇది మీ అందరి కషి వల్లే సాధ్యమైందని సిబ్బందిని అభినందించారు. ఇలాగే ఎప్పుడు ఇతర డిపోలకు స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని కోరారు. డిపో ఉద్యోగులకు, సిబ్బందికి అవార్డులను అందజేశారు.1-డిపో ఎం.ఎఫ్ సమత అధ్యక్షతన నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్-1 డిపో మేనేజర్ రవీందర్, 3- డిపో మేనేజర్ శ్రీధర్, 30 మంది మెకా నిక్‌లు, 30 మంది డ్రైవర్లు, సూపర్వైజర్ వెంకటేష్, ఎంప్లా యిస్ వెల్ఫేర్ సభ్యులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.