హెచ్‌-1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలుహెచ్‌-1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఈ వీసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, హెచ్‌-1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ప్రతిఏటా కేవలం 65 వేల హెచ్‌-1బీ వీసాలను మాత్రమే యూఎస్‌ సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలను అందజేస్తోంది.