రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ ఈ నెల 21న

 


రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ ఈ నెల 21న జరగనుంది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో ఉన్న 3,299 గ్రామాలకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో 553 సర్పంచ్‌ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 2,744 స్థానాలకు 7,475 మంది పోటీ పడుతున్నారు. కాగా.. ఇదే దశలో ఎన్నికలు జరగాల్సిన 33,435 వార్డు సభ్యుల స్థానాల్లో 10,921 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 22,422 వార్డుల కోసం 49,083మంది బరిలో ఉన్నారు.