జేఈఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు

 


దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. జేఈఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగనున్నాయి.

విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్‌టీఏ మూడు వేరువేరు లింక్‌లను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అడ్మిట్‌ కార్డులను సులభంగా, వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాదినుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షను ఒకటికంటే ఎక్కువసార్లు రాసుకునే అవకాశం ఉన్నది. జేఈఈకి అర్హత సాధించాలంటే విద్యార్థులు 12 తరగతి పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ కోసం 6.60 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు.


వెబ్‌సైట్‌: jeemain.nta.nic.in.