ఏపీ కేబినెట్‌ ఈ నెల 23న సమావేశం

 


ఏపీ కేబినెట్‌ ఈ నెల 23న సమావేశం కానుంది. అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో 2021-22 శాసనసభా బడ్జెట్‌ సమావేశాలపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టత ఇచ్చే వీలుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో ఉగాది నాడు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సమాచారం. సచివాలయ కార్యాలయాలు విశాఖకు తరలివెళ్లాలంటే కనీసం రెండు నెలలన్నా కావాలన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. ఈ నెల 23న జరుగనున్న కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై స్పష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.