గడిచిన 24 గంటల్లో 13వేల 742 కొత్త కోవిడ్‌ కేసులు

 


భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 13వేల 742 కొత్త కోవిడ్‌ కేసులు నమోదు కాగా.. 104 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కోటి 10 లక్షల 30వేల 176 కేసులు రికార్డు కాగా.. కరోనా మృతుల సంఖ్య లక్షా 56వేల 567కు చేరింది. దేశంలో ప్రస్తుతం లక్షా 46వేల 907 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు భారత్‌లో కోటి 21 లక్షల 65వేల 598 మందికి టీకా వేశారు.