గత ఏడాది వరదలు, తుపానులు, తెగుళ్లతో పంటలు నష్టపోయిన 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద రూ.3,113.05 కోట్ల మేర కేంద్ర అదనపు సాయం అందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ (హెచ్ఎల్సీ) ఆమోదం తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న ఏపీ, బిహార్, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ ప్రజలకు సాయం అందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని అమిత్ షా శనివారం చెప్పారు. వరదలు, తుపానులు కారణంగా నష్టం వాటిల్లిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.78 కోట్లను అదనపు సాయంగా కేటాయించినట్టు తెలిపారు.