అనాటమిక్‌ 3డీ మెడ్‌ టెక్‌తో ఒప్పందం చేసుకున్న అపోలో

 


ఆసియాలో అత్యుత్తమ సమగ్ర వైద్య సేవలు అందిస్తున్న వాటిలో ఒకటైన అపోలో హాస్పిటల్‌ గ్రూపు డిజైన్‌ త్రీడీ ప్రింటింగ్‌, ర్యాపిడ్‌ ప్రోటో టైపింగ్‌, బయో ప్రింటింగ్‌ టెక్నాలజీతో అనాటమిక్‌ 3డీ మెడ్‌ టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశంలో ప్రముఖంగా రోగి ప్రత్యేకమైన పరిష్కారాలను అందిస్తూ సంక్లిష్ట ఇంప్లాంట్లను ముద్రించటంలో అనాటమిక్‌ 3డీ మెడ్‌ టెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎంతో ఉపయోగపడుతుందని అపోలో గ్రూప్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. రోగులకు అత్యంత ప్రయోజనాన్ని చేకూర్చేందుకు వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరికొత్తగా తీసుకురావడంలో తాము ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. అపోలో గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీత రెడ్డి మాట్లాడుతూ త్రీ డీ ప్రింటింగ్‌ నేడు ఆరోగ్య సంరక్షణలో విస్తృతంగా ఉపయోగపడుతుందన్నారు.