42 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్

 


 దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 42 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 9 రాష్ట్రాలు 60 శాతం దాటాయి. ఫిబ్రవరి రెండో తేదీన తొలి వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్లు.. రెండవ డోసును 62 శాతం మంది మాత్రమే తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్ల సంఖ్య 1.19 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మంగళవారం నాటికి 1,19,07,392 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంట్లో హెల్త్‌కేర్ లబ్దిదారులు 64,71,047 మంది తొలి డోసు తీసుకున్నారు. 13,21,635 మంది రెండవ డోసు తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 41,14,710 మంది తొలి డోసు తీసుకున్నారు. జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.