దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ఘాటు.ఇప్పుడు కిలో ఉల్లి రూ.45

 


న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ఘాటు పెరిగింది. ఉల్లితోపాటు కూరగాయల ధరలు కూడా సామాన్యులు అందుకోలేనంతగా ఆకాశాన్నంటుతోన్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటేనే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం ఉల్లి ధర కిలోకు 20 రూపాయలు పలికితే.. ఇప్పుడు కిలో ఉల్లి రూ.45 కు పలుకుతోంది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని మానేశారు. ఉల్లికి బదులుగా ఖీరా, క్యారెట్‌ లను ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌, బెంగాల్‌, నాసిక్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉల్లి దిగుమతి అయితే, వీటి ధరలు తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు.  ఉల్లితోపాటు ఆలూ కూడా.. ఉల్లికితోడు ఆలూ ధరలు కూడా అమాంతం పెరిగాయి. గతంలో హోల్‌ సేల్‌ లో కిలో ఆరు నుంచి ఏడు రూపాయలకు లభించే ఆలూ ప్రస్తుతం రూ.20 కి దొరుకుతోంది. ఇటీవలి కాలంలో ఆలూ ఉత్పాదన పెరుగుతోందని, దీని ధర మరింతగా తగ్గవచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.