అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాళ్ల రేషన్ బియ్యo

 


సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని చౌక దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు రెండు లారీల్లో తీసుకెళ్తున్నారు. జహీరాబాద్ బైపాస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యంతో సహా.. రెండు లారీలను సీజ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గిడ్డంగికి తరలించారు.