ఇంటింటికి 5లక్షల రూపాయల చొప్పున ఆరోగ్య బీమా

 


రాజస్థాన్ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బడ్జెట్‌లో వరాలిచ్చారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఇంటింటికి 5లక్షల రూపాయల చొప్పున ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఆరోగ్య బీమాను కల్పిస్తూ నూతన పథకానికి బడ్జెట్ లో రూ.3,500లను కేటాయించారు. ఆరోగ్య హక్కు బిల్లులను రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న రాజస్థాన్ సర్కారు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ ను రూపొందిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సర్కారు రాజస్థాన్ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు.కరోనా నియంత్రణకు అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.ప్రత్యేక కొవిడ్ ప్యాకేజీని అమలు చేస్తామని సీఎం గెహ్లాట్ ప్రకటించారు. కరోనా సంక్షోభం సందర్భంగా ఒక్కో కుటుంబానికి మరో వెయ్యిరూపాయల చివరివిడత ఆర్థికసాయం అందిస్తామని సీఎం చెప్పారు.పోటీ పరీక్షలు రాసేందుకు వస్తున్న అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని సీఎం చెప్పారు.