ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

 

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీకి రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు ఏపీ గవర్నర్‌, సీఎం జగన్‌ స్వాగతం పలుకనున్నారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్‌ అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్సంగ్‌ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ జరిగే శంకుస్థాపన, భారత్‌ యోగా విద్యా కేంద్ర "యోగా కేంద్రం" ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్సంగ్‌ విద్యాలయంలో మొక్కలు నాటుతారు. అనంతరం సదుం మండలంలోని పీపుల్స్‌ గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు. ఇక సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరు తిరుగు పయనమవుతారు.