8.7 లక్షల 'మేడ్ ఇన్ ఇండియా' ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోస్‌లు ఆదివారం మెక్సికోకు

 


భారత్‌ నుంచి 8.7 లక్షల 'మేడ్ ఇన్ ఇండియా' ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోస్‌లు ఆదివారం మెక్సికోకు చేరుకున్నాయి. వ్యాక్సిన్ డోస్‌లు మెక్సికోకు చేరుకున్నట్టు కొద్ది సేపటి క్రితం అక్కడి ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయపడినందుకు భారత ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపెజ్ ధన్యావాదాలు తెలిపారని అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత ప్రభుత్వం త్వరలోనే మరో 12 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను మెక్సికోకు పంపనుంది.

మెక్సికోలో ఇప్పటివరకు 19,88,695 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 1,73,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు 2.3 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను పంపింది. కెనడా, భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్ ఇతర దేశాలు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ డోస్‌లను పొందిన దేశాల జాబితాలో ఉన్నాయి.