87.40లక్షల మందికి వ్యాక్సిన్‌

 


దేశంలో ఇప్పటి వరకు 87లక్షలకుపైగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మోతాదులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 87.40లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, ఇందులో 85.70 వ్యాక్సిన్‌ మొదటి విడుత డోసనీ, రెండో విడత మోతాదు 1.70లక్షల మందికి ఇచ్చినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ రోజురోజుకు వేగవంతమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. అలాగే 14 రాష్ట్రాలు 70 శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు అందించే ప్రక్రియను పూర్తిచేశాయన్నారు. అయితే ఢిల్లీ 42 శాతం మంది వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు వేసిందని తెలిపారు. పది రాష్ట్రాలు కేవలం పది శాతం మంది సిబ్బందికే టీకాలు పంపిణీ చేశాయని పేర్కొన్నారు.