హైదరాబాద్‌లో రూ.91.96కి చేరిన లీటరు పెట్రోల్‌

 
దిల్లీ: దేశంలో వరుసగా అయిదో రోజూ చమురు ధరల పెరుగుదల కొనసాగింది. పెట్రోల్‌ లీటరుపై 30 పైసలు, డీజిల్‌పై 36 పైసలు పెంచుతూ చమురు సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.88.44, డీజిల్‌ రూ. 78.74కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 95కి చేరువైంది. అక్కడ పెట్రోల్‌ రూ.94.93, డీజిల్‌ రూ.85.70కు ఎగబాకింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌పై 31 పైసలు.. డీజిల్‌పై 39 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.91.96, డీజిల్‌ రూ.85.89కి చేరింది. గత అయిదు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.51, డీజిల్‌పై రూ.1.56 పెరగడం గమనార్హం.