టీ-యాప్‌ ఫోలియో(ఎనీవేర్‌-ఎనీటైం) సేవలకు స్పందన అంతంత మాత్రం

 


రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీ-యాప్‌ ఫోలియో(ఎనీవేర్‌-ఎనీటైం) సేవలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రారంభించిన సేవలకు వినియోగదారుల నుంచి ఆదరణ కరువవుతోంది. ఏడు నెలల క్రితం డూప్లికేట్‌ ఎల్‌ఎల్‌ఆర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జి మంజూరు, స్మార్ట్‌కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షిట్‌ వంటి అయిదు రకాల పౌరసేవల్ని ఆన్‌లైన్‌లోకి మార్చిన రవాణాశాఖ.. అనంతరం మరో 12 రకాల సేవలను ఆన్‌లైన్‌ చేసింది. ఇలా మొత్తం 17 రకాల సేవలను ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఎక్కడినుంచైనా నేరుగా పొందవచ్చు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3వేల మంది మాత్రమే ఆర్టీఏ సేవలను ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకున్నారు. వీటిలో సింహభాగం లెర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లెసెన్స్‌ రెన్యూవల్స్‌ ఉన్నాయి.