దేశరాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం

 


దేశరాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో మెట్రో సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం మెట్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫలితంగా మెట్రో కోచ్‌లలోని అన్ని సీట్లలో కూర్చొనేందుకు ప్రయాణికులకు అనుమతి లభించనుంది. ఈనెల 22న ఎల్జీ అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం(డీడీఎంఎ)తో జరిగే సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.


కరోనా తగ్గుముఖం పట్టిన ప్రస్తుత తరుణంలో కరోనా నిబంధనలు సడలించాలని మెట్రో... ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ప్రయాణకులు సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతానికి మెట్రోలోని అన్ని సీట్లలో కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. ప్రతీ ఇద్దరు ప్రయాణకుల మధ్య ఒక సీటును ఖాళీగా ఉంచడం తప్పనిసరి చేశారు. అయితే ఇటీవలి కాలంలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూవస్తోంది.