మిజోరంలోని చంఫాయ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదయ్యింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చంఫాయ్‌లో భూకంపం వచ్చిందని నేషన్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులుతీశారు. కొద్దిసేపటి వరకు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు వెల్లడించారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు
కాగా, ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల్లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4.01 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.9గా నమోదయ్యిందని వెల్లడించింది. కాబూల్‌కు 277 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొంది. భూ అంతర్భాగంలో 97 కి.మీ.లోతులో భూ ఫలకాలు కదిలాయని తెలిపింది.