వేలాది మంది రైతులతో 'మహా పంచాయత్‌'

 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తున్న ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు 'మహా పంచాయితీ' నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల సమ్మెళనంగా పిలువబడుతున్న ఈ మహా పంచాయితీలు వివిధ ప్రాంతాలను నుంచి వేలాది మంది రైతులు హర్యానాలోని సర్‌ చోటు రామ్‌ మెమోరిల్‌కు చేరుకోవడానికి వస్తున్నారు. స్వతంత్రానికి ముందు రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు తీసుకువచ్చిన సర్‌ ఛోటు రామ్‌ను రైతులు స్మరించుకున్నారు. దాదాపు పదివేల మందికి పైగా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రానికి హాజరయ్యేందుకు 40 కిలో మీటర్ల నుంచి కాలినడకన ప్రయాణించి సర్‌ ఛోటు రామ్‌ మెమోరియల్‌కు చేరుకున్నానని భూజంపై నాగలి పెట్టుకుని ఉన్న డాక్టర్‌ పరమ్‌జిత్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసకువచ్చిన సాగుచట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించడానికి పలు గ్రామాల్లో పర్యటించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ మహాపంచాయితీలు హర్యానా అంతటా ప్రతిరోజు నిర్వహించబడుతున్నాయని పరమ్‌జిత్‌ తెలిపారు. ప్రభుత్వాన్ని బీజేపీ తమ ఆస్థిగా చూస్తోంది. ఒక రోజు తమను పేరుతో పిలుస్తూ.. మరో రోజు ఉగ్రవాదులు అనే ముద్రను వేస్తున్నారని అన్నారు. రోహాడ్‌ నుంచి వచ్చిన రైతు సుమన్‌ మాట్లాడుతూ.. నేడు జరుగుతున్న పోరాటం రైతుల న్యాయమైన డిమాండ్ల కోసమేనని తెలి పారు. అలాగే, తమ భూములు కార్పొరేట్ల పరం కాకుడా, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వివాదాస్పద చట్టాలను రద్దు చేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం వస్తువుల ధరలు పెంచుతోంది. దీనిని తగ్గించాలి. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు రోజురోజుకు పేరుగుతోంది. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. మరీ రైతు పంటకు ధర ఎందుకు పెంచరు? అంటూ ప్రశ్నించారు.