బంగ్లాదేశీయులకు ఇండియా పాస్పోర్ట్

 


బంగ్లాదేశీయులకు దుబాయ్‌ వీసా దొరకడం కష్టంగా మారడంతో వారు దొడ్డిదారిని వెతుక్కుంటున్నారు. ఇందుకు భారత్‌లోని కొందరు ఏజెంట్లు, అధికారులు వారికి సహకరిస్తున్నట్టు తెలిసింది. బంగ్లా నుంచి ఎలాగోలా కోల్‌కతా చేరుకుంటున్న బంగ్లాదేశీయులను నిజామాబాద్‌ జిల్లా తీసుకొచ్చి ఉంచుతున్నారు. ఇక్కడి చిరునామాతోనే వారికి ఆధార్‌కార్డు ఇప్పిస్తున్నారు. ఆ తరువాత ఒక్కో పాస్‌పోర్టుకు రూ.25వేల ఉంచి రూ.50 వేల వరకు ఏజెంట్లు వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌కు వెళుతున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ మల్లేశ్‌కు రూ.2వేలు, ఏఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు రూ.వెయ్యిచొప్పున ముట్టజెప్తున్నారు. ఈ తతంగం గత రెండేండ్లుగా సాగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అడ్డదారిలో పాస్‌పోర్టులు పొందినవారిలో బంగ్లాదేశీయులు ఉన్నారని, రోహింగ్యాలు లేరని సీపీ సజ్జనార్‌ స్పష్టంచేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్నదని ఎవర్నీ వదిలిపెట్టే సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు.