ఏపీలో తొలిదశ పంచాయతి ఎన్నికలు నేడు ప్రారంభం

 


ఏపీలో తొలిదశ పంచాయతి ఎన్నికలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తరువాత ఫలితాలు ప్రకటిస్తారు. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లో తొలిదశ పోలింగ్ జరగబోతున్నది. 2773 పంచాయితీలు, 20,157 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. తొలిదశ ఎన్నికల కోసం మొత్తం 29,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. మొత్తం 3,249 గ్రామపంచాయతీలకు గాను 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 32,502 వార్డు మెంబర్లకు గాను, 12,185 ఏకగ్రీవం అయ్యాయి. మొదటిదశలో 7,506 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్ఈసి పర్యవేక్షిస్తుంది. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాను ఏర్పాటు చేశారు.