కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు

 


కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్ జరగనుంది. 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. 45- 59 సంవత్సరాలకు సైతం కొవిడ్‌ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్రాలు మినహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీకా ఇవ్వబోతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లోనూ టీకా ఇవ్వనున్నారు.


మొత్తం 2వేల 222 టీకా కేంద్రాల వివరాలు యాప్‌లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిన్ 2.0 యాప్‌లో శనివారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్‌ జరుగుతోంది. ఈ యాప్‌ ద్వారా అర్హుల వివరాలు నమోదు చేసుకునేందుకు సోమవారం నుంచి అవకాశం కల్పించనున్నారు. యాప్‌లో డిటైల్స్ నమోదు చేసుకోవడం తెలియని వారికి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో సాయం అందించేలా వైద్యారోగ్య ఏర్పాట్లు చేస్తారు.


వార్డు సచివాలయ సిబ్బంది సహకారం కోసం డిపార్ట్‌మెంట్లను కోరింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోకున్నా పుట్టిన తేదీ ఉండే కార్డు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు వైద్యులిచ్చిన సర్టిఫికేట్ చూపించి వ్యాక్సిన్ పొందొచ్చు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కాస్ట్ రూ.150, సర్వీసు ఛార్జీ మరో రూ.100 కలిపి మొత్తం రూ.250 తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ రిలేటెడ్ హాస్పిటల్స్‌లో వైద్యారోగ్యశాఖే వ్యాక్సిన్ సప్లై చేస్తుంది.


ఈ ప్రక్రియలో వ్యాక్సిన్ వేస్ట్ అవకుండా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీకా తరలించేందుకు 26 వాహనాలను ఉపయోగిస్తున్నారు. అవే కాకుండా మరో 52 వాహనాలను వినియోగించనున్నారు. పీహెచ్‌సీల వరకూ టీకా తరలింపునకు మ్యాపింగ్‌ చేస్తున్నారు. మొత్తం 17వేల 715 మంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితా ప్రస్తుతం కొవిన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ డిటైల్స్ ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్‌సైట్‌లోనూ ఉండనున్నాయి.