తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

  


ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్‌పర్సన్స్, జడ్పీ చైర్‌పర్సన్స్, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


కాగా ఈ సమావేశంలో కేటీఆర్‌కు పట్టాభిషేకంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ, సాగర్ బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే ఇది రోటీన్ సమావేశమేనని పార్టీ పెద్దలు అంటున్నారు. సభ్యత్వాలు, పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, సంస్థాగత అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.