ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్ష సూచన

 


 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉత్తర కోస్తాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించింది. దక్షిణ మధ్య మహారాష్ర్ట, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన ఉపరిత ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం వర్షం పడినట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. ఉపరితల ఆవర్తనానికి తోడు పశ్చిమ ఆవాంతరాల వల్ల ఉదయం నుంచే హైదరాబాద్‌ను మబ్బులు కమ్మేశాయి. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వీటి ప్రభావంతో రెండ్రోజులు గ్రేటర్‌లో అక్కడకడా వర్షాలు కురువొచ్చని అధికారులు తెలిపారు.