రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం

 


హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లోట్‌సపాండ్‌లో జరగనున్న ఈ సమావేశానికి దాదాపు 700 మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో మార్చి 2న ఆత్మీయ సమావేశం నిర్వహించాలని షర్మిల నిర్ణయించారు. కొండా రాఘవరెడ్డి తదితరులతో శుక్రవారం ఆమె సమావేశమై ఈ మేరకు తేదీని ఖరారు చేశారు.