పతంజలి సంస్థ ఐదు లక్షల మందికి ఉపాధి దేశంలో పామాయిల్ ఉత్పాదకత పెరిగిన తరువాత పతంజలి సంస్థ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిందని యోగా గురువు బాబా రామ్‌దేవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దఎత్తున కేటాయింపులు చేయడం సంతోషకరమన్నారు. నిర్మాణరంగంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మార్కెట్లను ఆధునీకరించడంతోపాటు గ్రీన్ కల్చర్ ఇన్ఫాస్ట్రక్చర్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు.  బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం అన్ని రంగాలపై దృష్టి పెట్టిందన్నారు. ఇది అభివృద్ధిదాయక బడ్జెట్ అని రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు. వంటనూనెల ఉత్పాదనలో దేశం ఎంతో ముందున్నదని అన్నారు. తాము పతంజలి సంస్థ ద్వారా సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అన్ని రంగాల వారికి ప్రయోజనకరంగా ఉన్నదని అన్నారు.