చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు

 


 చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి. వరుసగా నాలుగో రోజు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైసల వరకు పెంచాయి. ఫిబ్రవరిలో ధరలు పెరగడం ఇది ఆరోసారి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 88.14కు పెరగ్గా.. డీజిల్‌ రూ.78.38కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.65, డీజిల్‌ రూ.85.50కి పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ రూ.94.64, చెన్నైలో రూ.90.44, బెంగళూరులో రూ.91.09, జైపూర్‌లో రూ.94.81, పాట్నాలో రూ.90.86, బెంగళూరులో రూ.91.09, డీజిల్‌ లీటర్‌కు ముంబైలో రూ.85.32, చెన్నైలో రూ.85.32, బెంగళూర్‌లో రూ.83.09, జైపూర్‌లో రూ.86.89, పాట్నాలో రూ.83.87, త్రివేండ్రం రూ.84.28కు చేరింది.