దేశంలో మరో ఎన్నికల నగరా

 


దేశంలో మరో ఎన్నికల నగరా మోగనుంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల సీఈసీ సభ్యులు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఐదు అసెంబ్లీ నగరా కూడా మోగనుంది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ మార్చిలో విడుదల అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.