అభివృద్ధి దశలో మరో ఏడు వ్యాక్సిన్లు

  భారత దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ లకు అదనంగా మరో ఏడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. వీటిల్లో మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయని, మరో రెండు ప్రీ క్లినికల్ దశలో ఉండగా, ఒకటి ఫేజ్ 1, మరోటి ఫేజ్ 2 దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్లలో దేన్నీ అత్యవసరంగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు, ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియాలో వ్యాక్సినేషన్ మూడవ దశను త్వరలోనే ప్రారంభించనున్నామని హర్షవర్ధన్ స్పష్టం చేశారు