ద్వీప దేశం మాల్డీవులు, భారత్‌ల మధ్య ఆదివారం కీలక ఒప్పందం

 


ద్వీప దేశం మాల్డీవులు, భారత్‌ల మధ్య ఆదివారం కీలక ఒప్పందం జరిగింది. దాదాపు రూ.365 కోట్ల ( 50 మిలియన్‌ డాలర్లు ) విలువ చేసే రక్షణ రంగ ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవుల భద్రతపై భారత్‌ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ ద్వీప దేశం తమ సముద్ర తీర భద్రతా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన రక్షణ ప్రాజెక్టులను భారత్‌ సహకారంతో చేపట్టనుంది.