గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో చీఫ్ ఇంజినీర్ల(సీఈ) పోస్టుల్లో మారోసారి మార్పులు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ శుక్రవారం ప్రొసిడింగ్స్ జారీచేశారు. దీంతో బల్దియాలో చీఫ్ ఇంజనీర్ల సంఖ్య నాలుగుకు చేరింది. జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టులు) రుమాండ్ల శ్రీధర్‌కు పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)గా పదోన్నతి లభించింది. దీంతోపాటు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(ఎస్ఆర్డీపీ)ను సైతం శ్రీధర్‌కు కేటాయించారు. జియావుద్దీన్‌కు హైదరాబద్ రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) చీఫ్ ఇంజినీర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(సమన్వయం, పరిపాలన) విభాగాన్ని యధావిధిగా ఉంచారు. ఎం.దేవానంద్‌కు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(నిర్వహణ), సరోజరాణికి చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టులు) బాధ్యతలు అప్పగించారు. రోడ్డు స్ట్రాటజిక్ రోడ్డు డవలప్మెంట్ ప్రొగ్రామ్(ఎస్ఆర్డీపీ) పనులకు సంబంధించిన ఫైళ్లను చీఫ్ ఇంజినీర్(ఎస్ఆర్డపీ) ద్వారా పంపించాలని ప్రొసిడింగ్లో పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టులు), చీఫ్ ఇంజినీర్(నిర్వహణ)కు ఆర్.శ్రీధర్, జియావుద్దీన్ల సహకారం ఉంటుందని పేర్కొన్నారు.