రెండు కోట్ల డోసుల 'కొవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌కు ఎగుమతి

 


రెండు కోట్ల డోసుల 'కొవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌కు ఎగుమతి చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. కరోనా ముప్పును అదుపు చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రెజిల్‌కు తోడుగా నిలుస్తున్నామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. బ్రెజిల్‌ ఆరోగ్య శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నామని, మార్చి నుండి ఎగుమతులు ప్రారంభమవుతాయని తెలిపింది. కాగా, బ్రెజిల్‌లో కరోనా ఉధృతంగా ఉంది. ఇప్పటివరకు సుమారు 2.5 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్‌ కోసం సంప్రదింపులు జరుపుతున్నాయని.. ఆయా దేశాలకు కూడా 'కొవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ను అందిస్తామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.