రాష్ట్రంలో రెండు రోజులుగా చలి తీవ్రత

 


ఈశాన్య, ఉత్తరాది దిశల నుంచి శీతలగాలులు జోరుగా వీస్తుండటంతో రాష్ట్రంలో రెండు రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఎండల తీవ్రత పెరగాల్సిన సమయంలో అనూహ్యంగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు ఏర్పడుతున్నది. మరో రెండు రోజులపాటు చలిగాలుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఆ తర్వాత ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నదని వివరించారు.