గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రజకుల లాండ్రీ, దోబీఘాట్, డ్రై క్లినిక్ షాపులకు ఉచితం కరెంట్ ఇస్తామని హమీనిచ్చారనీ, ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రజక వత్తిదారుల సంఘం కమిటీ సమావేశం సీహెచ్.నగేశ్ అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ హామీనిచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ఉచిత కరెంటుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో నీట మునిగిన దోబీఘాట్లన్నింటికీ మరమ్మతుల నిమిత్తం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. నగరంలో నిర్మించనున్న డబుల్‌బెడ్ రూం పథకం రజక వత్తిదారులకు వర్తింపజేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మల్లేష్ మాట్లాడుతూ ఈ నెల చివరన రంగారెడ్డి జిల్లా రజక వత్తిదారుల సంఘం మహా సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రజకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల ఉమేష్, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రేవల్లీ నరేష్, వినాయక హిల్స్ రజకసంఘం అధ్యక్షులు పుల్లయ్య, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాలకష్ణ, సంఘం జిల్లా సలహాదారులు శ్రీనివాస్, సంజీవ, బాలారాజ్, తదితరులు పాల్గొన్నారు.