తెలంగాణలో మరో కొత్త పార్టీ ...

 తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభంకానుందా? చలో లోటస్‌ పాండ్‌కు పిలుపునిచ్చిన షర్మిల.. అభిమానులు, అనుచరులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ భవితకు పూనాది అంటూ సోషల్‌ మీడియాలో జోరుకు కారణాలేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే నిజమే అనే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల కొత్త పార్టీ అనే సంకేతాలను ఖండించారామె. కానీ, తాజాగా వైఎస్‌ఆర్‌ సన్నిహితులకు షర్మిల దగ్గర నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్లడం.. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తున్నాయి.  తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెడుతారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇవాళ 10 గంటలకు చలో లోటస్‌ పాండ్‌కు పిలుపునివ్వడం కాక రేపుతోంది. లోటస్‌పాండ్‌లో సమావేశం తర్వాత షర్మిల ఏం చెబుతారో అనే దానిపై సర్వత్రా ఆశక్తి రేపుతోంది. వైఎస్ఆర్‌ అభిమానులారా రేపటి తెలంగాణ భవితకు తరలి రండి అంటూ ఆమె పంపిన మెస్సెజ్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పాట్..  ఇదిలా ఉంటే.. కొత్త పార్టీతో ఏపీ సీఎం జగన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తున్నారు షర్మిల. అందుకోసం ఏపీలో యాక్టివ్‌గా ఉన్న రాజకీయనాయకులు తనను ఇక కలవద్దంటూ తేల్చి చెప్పారంట ఆమె. తెలంగానలో ఇప్పటికే కొంతమంది నల్గొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. జూన్‌లో షర్మిల కొత్త పార్టీ పట్టాలెక్కుతుందని ఆమె అనుచరులు అంటున్నారు.  అందుకోసం అన్నకు ఇబ్బంది లేకుండా లోటస్‌ పాండ్ ఖాళీ చేసి గచ్చిబౌలీకి మకాం మార్చనున్నట్టు తెలుస్తోంది. షర్మిల పెట్టబోయే పార్టీ కోసం కార్యాలయం, నివసించేందుకు ఇల్లు ఇప్పటికే అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ఇలా అనుచరులతో సమావేశం తర్వాత షర్మిల ఏం చెప్పబోతారో అనేది ఆసక్తికరంగా మారింది.