ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మరోమారు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం

 .


ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మరోమారు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వివిధ దేశాలకు టీకాలు సరఫరా చేస్తూ ఆపద సమయంలో ఆదుకుంటున్నందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. 'టీకా సరఫరాలో సమన్యాయం నెలకొల్పే దిశగా సహాయపడుతున్న భారత్‌కు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. పేద దేశాలకు టీకాలు అందించే కోవ్యాక్స్ వ్యవస్థకు మీరిస్తున్న మద్దతు.. 60 దేశాల్లో తొలి దశ టీకా కార్యక్రమం ప్రారంభయ్యేందుకు దోహదపడుతోంది. వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందుతోంది. ఇతర దేశాలు కూడా ఈ విధానాన్నే అనుసరిస్తాయని నేను ఆశిస్తున్నా' అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు.