దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాతి అగ్నిప్రమాదం

 దేశ రాజధాని ఢిల్లీలోని ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-2 సంజయ్‌నగర్‌లో కాలనీలో శనివారం అర్ధరాతి అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఫర్నిచర్ కాలి బూడిదయ్యింది. ఆప్రాంతంలో దట్టమైన పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 27 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా అగ్నిమాపకశాఖ అధికారి మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, 27 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తారని చెప్పారు.