బీజేపీ చలో హుజూర్‌నగర్ కార్యక్రమం బీజేపీ చలో హుజూర్‌నగర్ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. బీజేపీ కార్యాలయం నుంచి హుజూర్‌నగర్‌కు బయలుదేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు విజయశాంతి, రాజాసింగ్, జితేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు భారీ కాన్వాయ్‌తో హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు. గిరిజనుల భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పాత్ర ఉందని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది. గిరిపుత్రుల తరుపున కొంత కాలంగా పోరాటం చేస్తున్న బీజేపీ.. ఆదివారం చలో హుజూర్‌నగర్ నిర్వహించనుంది. అయితే బీజేపీ చలో హుజూర్‌నగర్‌కు పోలీసుల అనుమతిపై అనిశ్చితి నెలకొంది. గిరిపుత్రులను పరామర్శించేందుకు పోలీసుల అనుమతి అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు.