కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు

 


 కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. కిరణ్‌బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుండి తొలగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుండి మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదలైంది. ఇప్పుడుఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కొత్త గవర్నర్‌ను నియమించే వరకు తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాగా, కిరణ్‌బేడీ తొలగింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలో పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.