అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

 


అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. అదే విధంగా పెద్ద సంఖ్యలో కార్లు, కంటైనర్లు ధ్వంసమయ్యాయి. డల్లాస్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ఇంటర్‌స్టేట్ 35పై ఈ ఘటన చోటుచేసుకుంది. డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతంలో మంచుతో కూడిన రహదార్లు ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంచు గడ్డలుగా పేర్కొని ఉండటంతో ఉదయం పూట వెళ్లే వాహనదాలు ఈ ప్రమాదం బారినపడ్డారని అధికారులు చెబుతున్నారు.