ఎట్టకేలకు అచ్చెన్నాయుడు కు బెయిల్

 


బెదిరింపులు కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు కు బెయిల్ లభించింది. కొద్ది రోజుల క్రితం తన సొంత గ్రామం అయిన నిమ్మాడలో తన బంధువు అప్పన్న వైసీపీ నుండి నామినేషన్ వేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఏమయినా అవసరం ఉంటే తాను చూస్తానని ఇలా నామినేషన్ వేయవద్దని అచ్చెన్న కాల్ చేసి అడిగారు. దీంతో తనను నామినేషన్ వేయకుండా బెదిరించారని చెబుతూ అప్పన్న పోలీసు కేసు పెట్టారు.   ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన పోలీసులు వచ్చే నన్ను అరెస్టు చేశారు.. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కేసు బుక్ రాలేదని చెబుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయనకు నిన్న సాయంత్రం బెయిల్ లభించింది. ఈ రోజు ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.