అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటి

 


ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటిని అందించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పంజాబ్‌ కూడా 100 శాతం టార్గెట్‌ను పూర్తిచేశాయి.