తూర్పు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత

 


రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. తూర్పు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత కొనసాగుతోంది. గురువారం అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల మూడ్రోజులు ఇదే వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ర్టంతో ఖమ్మం జిల్లా ప్రకాశ్‌నగర్‌లో 36.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా వణికిస్తున్న చలికి వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌ ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.