హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గిరిజన కోటాలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

 


హైదరాబాద్‌ : బేగంపేట, రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గిరిజన కోటాలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి కమలాకర్‌రెడ్డి తెలిపారు. గిరిజన కోటాలో బాలురు 4, బాలికలకు 2 సీట్లు ఉండగా.. ఇందులో లంబాడకు 2, ఎరుకల 1, ఇతర గిరిజన తెగలకు 3 సీట్లను కేటాయించినట్టు పేర్కొన్నారు. మార్చి 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.