మాఘపౌర్ణమి వివాహాది శుభకార్యాలకు శుభం

     

మాఘపౌర్ణమి వివాహాది

శుభకార్యాలకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో నది స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మాఘమాసం స్నానాన్ని ఆచరించడం వల్ల అందంతోపాటు ఐశ్యర్యం, ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుంది. ఈ మాసంలో స్నానం ఆచరిస్తే మంచితనం, ఉత్తమశీలం లభిస్తుంది. దీనికి అంతటి విశిష్టతకు కారణం సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సమయంలో శివకేశవులిద్దరికీ పూజించాలని చెబుతారు.

ఈ మాసంలో దానధర్మాలు చేయాలని, సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసంలో నదీ స్నానం కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో అయినా చేయాలి. ఈ మాసంలో జలంలో గంగ నీటిలోకి ప్రవేశించి ఉంటుందని నమ్మకం.

శక్తిమేర దానం చేయాలి

ఈ మాఘ పౌర్ణమినే మహా మాఘి అని కూడా అంటారు. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలల్లో ఉంచుతారు. అందుకే మాఘ స్నానం చాలా గొప్పది. స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడిని నమస్కరించి, నైవేద్యం సమర్పించాలి అంటారు. అలాగే శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ మాసం పౌర్ణమినాడు గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి. అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే చెబుతాడు. ఈ మాసంలో వచ్చే భిష్మ ఏకాదశి కూడా విశేషమైంది. 52 రోజులు అంపశయ్యపై పరుండి దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తాడు. అతన్ని చూడటానికి వచ్చిన శ్రీకృష్ణుడు వస్తే విష్ణు సహస్త్ర నామాలతో అతన్ని కీర్తిస్తాడు. అందుకే ఈ మాసం విష్ణు సహస్త్ర నామాలను ప్రతిరోజు పారాయణం చేస్తే ఐశ్యర్యం, కీర్త ప్రతిష్ఠలు పెరుగుతాయని అంటారు.