ఓయూ పరిధిలో బుధవారం నుంచి జరుగాల్సిన వివిధ 'లా' కోర్సుల పరీక్షలను వాయిదా

 


ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధిలో బుధవారం నుంచి జరుగాల్సిన వివిధ 'లా' కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని తిరిగి ఈ నెల ఐదు నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు మాత్రం యథావిధిగా ఈ నెల మూడోతేదీ నుంచే ఉంటాయని వెల్లడించారు.