సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన శుభాకాంక్షలు

 


 సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అహింసే ఆయుధంగా, సంకల్పమే సాధనంగా, ఊపిరే పణంగా పెట్టి తెలంగాణ స్వరాష్ట్ర పోరులో విజేతగా నిలిచి.. తెలంగాణ తల్లిని బంధవిముక్తురాలిని చేసిన ఉద్యమ సారధి, తెలంగాణ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని కోరారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రికి హరిత కానుక అందించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ప్రజా నేతకు పుట్టిన రోజున అందరూ నిండు మనస్సుతో ఆశీస్సులు అందించాలని కోరారు.