హిమాచల్ ప్రదేశ్ చంబా ప్రాంతంలో భూప్రకంపనలు

 


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు చంబా ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు చెప్పారు. కంగ్రా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 2.33గంటలకు భూమి కంపించింది. హిమాచల్ ప్రదేశ్ లో చంబా, కంగ్రా ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. గతంలోనూ హిమాచల్ ప్రదేశ్ లో పలుసార్లు భూమి కంపించింది.