తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు... తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 41,343 కరోనా టెస్టులు నిర్వహించగా, 177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101 కి చేరింది. ఇందులో 2,91,510 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,985 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,606 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.78 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.